యోగానుష్ఠానం వల్ల జీవన్ముక్తి లభిస్తుంది….
1 min read

కీర్తిరాజదాస్, ఇస్కాన్ ధర్మ ప్రచారకులు.
మండ్లెంలో ఘనంగా ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు.
కర్నూలు, న్యూస్ నేడు: యోగానుష్ఠానం వల్ల ఆత్మసాక్షాత్కారంతోపాటు, జీవన్ముక్తి లభిస్తుందని అప్పుడే మానవజన్మకు సార్థకత చేకూరుతుందని ఇస్కాన్ ధర్మ ప్రచారకులు కీర్తి రాజదాసు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూపాడు బంగ్లా మండలం గ్రామంలోని ఈ రుక్మిణీ పాండురంగ స్వామి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీమద్రామాయణంపై ధార్మిక ప్రవచనం చేశారు. తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ ధార్మిక వ్యాప్తిలో భాగంగా ఐదురోజులపాటు శ్రీమద్రామాయణము, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం ధర్మకర్త పొలిమేర హనుమంతరావు, ధర్మ ప్రచారమండలి సభ్యులు పి. రామచంద్రుడు, ఎ. శివశంకర రెడ్డి, మాకం కుమారస్వామి, విశ్వనాథం నారాయణ, కృష్ణయ్య, గానుగ శంకరయ్య, శ్రీ రామేశ్వర రెడ్డి, బాలమ్మ పార్వతిదేవి, మల్లికాదేవి, రోశమ్మ సుంకులమ్మ, శేషమ్మ, మణి, పద్మావతమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

