NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆపదలో ఉన్న వారికి ఆపద్బంధవులు చంద్రబాబు, లోకేష్

1 min read

మంత్రి నారా లోకేష్  కృషితో నేపాల్ నుంచి స్వస్థలలాకు తెలుగు ప్రజలు

మంత్రాలయం టిడిపి ఇంచార్జ్  ఎన్.రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం న్యూస్ నేడు : ఎక్కడో వివిధ ఘటన ల్లో చిక్కుకుని ఆపదలో ఉన్న తెలుగు వారి ని స్వస్థలాలకు తీసుకుని వస్తున్న ఆపద్బంధువులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలుగువారికి ఆపద అనే పదం వినబడితే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా ఆపదకి అడ్డుగా నిలుస్తున్నారని అన్నారు.  నేపాల్ లో జరుగుతున్న మారణహోమంలో తెలుగువారు ఉన్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించిన  ఘనత నారా లోకేష్ ది అన్నారు.  అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పర్యటనను రద్దు చేసుకొని చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లోకేష్ హుటాహుటిన సచివాలయానికి చేరుకొని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ఫర్ రూమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ గా మార్చి సహాయక చర్యలు వేగవంతం చేశారని తెలిపారు.  బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ఎక్కడ ఉన్నారో లొకేషన్ కోఆర్డినేట్లతో సహా మ్యాప్ సిద్ధం చేయించి అత్యవసర హెల్ప్ లైన్ లో ఏర్పాటుచేసి చిక్కుకుపోయిన వారికి ఆహారం, నీరు వసతి సదుపాయాలు కల్పించిన ఘనత లోకేష్ ది అన్నారు.  కేంద్రం అండతో సమన్వయంతో ఆపదలో ఉన్న వారిని సురక్షిత సురక్షితంగా రక్షించి పక్కా వ్యూహం తో ముందుకు పోతూ మానవస్పందన తమ ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను లోకేష్  చాటి చెప్పారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకోవడంలో తెలుగు దేశం పార్టీ ముందుంటుదని నారా లోకేష్  ద్వారా మరోసారి స్పష్టమైఓదని తెలిపారు. కంబోడియా సైబర్ స్కాం (జూన్ 2025) మోసపూరిత ఉద్యోగ ఆఫర్లతో చిక్కుకున్న మీసాల ఆది బాబు వంటి తెలుగు యువకులను రక్షించడంలో ఆనాడే లోకేష్  కృషి చేశారని తెలిపారు.  నేపాల్ లో మన తెలుగువారు చిక్కుకుంటే ఈ సైకో జగన్ రెడ్డి నుంచి కనీస స్పందన లేదు. మానవ దృక్పథంతో కూడా వ్యవహరించడం లేదని విమర్శించారు. గతంలో ఉత్తరఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని,గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకోరావడంలో  సీఎం చంద్రబాబు నాయుడు  కీలక పాత్ర పోషించారని ఇప్పుడు నారా లోకేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు గుర్తు చేశారు.  ఈ సమావేశంలో ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షులు రామకృష్ణ, ఐ టీడీపీ జాయింట్ సెక్రెటరీ మైబు,హుస్సేన్ ఆలం  తదితరులు పాల్గొన్నారు.

About Author