13న నందికొట్కూర్ లో జాతీయ అదాలత్..
1 min read

సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఈనెల 13న నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కోర్టు దగ్గర జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జి ఏ.శోభారాణి అన్నారు.గురువారం నందికొట్కూర్ కోర్టులో ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ మరియు సీఐలు ఎస్ఐలు మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జడ్జి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని పోలీసులు సహకరించాలని జడ్జి పోలీసులతో అన్నారు. రాజీకి అవసరమైన సివిల్ మరియు క్రిమినల్ తగదాలను పరిష్కరిస్తామని జూనియర్ సివిల్ జడ్జి పి రాహుల్ అంబేద్కర్ అన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి శరభయ్య,సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, నందికొట్కూరు సీఐలు సుబ్రహ్మణ్యం,ప్రవీణ్ కుమార్ రెడ్డి,ఎస్సైలు ఓబులేష్, తిరుపాలు,మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

