NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మిగనూరు అభివృద్ధికి కేరాఫ్ బీవీ

1 min read

చుట్టపు చూపుగా బుట్టా రేణుక ఎమ్మిగనూరుకు వస్తుంటారు_

100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి  పునాది.. వేసింది బీవీనే_

సూపర్ సిక్స్ పథకాలను ఓర్వలేక అసత్య ఆరోపణలు_

మధు బాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు

అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చకు వైసీపీ సిద్ధమా

టీడీపీ నాయకులు

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బీవీ కుటుంబం అని, ప్రజలకు ఎవరికి అడిగిన చెబుతారని, ఎమ్మిగనూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ఇంచార్జి బుట్టా రేణుక వారి పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అపద్దాలకు కేరాఫ్ గా నిలుస్తున్నది మీరు అని పట్టణ టీడీపీ అధ్యక్షుడు మాచాని మహేష్, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు కల్లీముల్లా, దామా నరసింహులు, హెచ్.డి.సి మెంబర్ అంబేద్కర్, నాయకులు మల్లెల అల్ ఫ్రెడ్ రాజు, నరసప్ప, విజయలక్ష్మిలు పేర్కొన్నారు.  స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చుట్టపు చూపులగా బుట్టా రేణుక నెలకుఎమ్మిగనూరుకు వచ్చి మీడియా ముందు కనబడుతున్నారని విమర్శించారు. 2014-2019 మధ్య ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి  కల ఎమ్మిగనూరులో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలనది ఆయన కలను నిజం చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు  ఆశీస్సులతో ఎమ్మిగనూరుకు వంద పడకల ఆసుపత్రి శిలాఫలకు ఆవిష్కరణ చేసి భూమి పూజ చేశారన్నా విషయాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు మరిచిపోయి మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. రాష్ట్రంలో 16,347 డీఎస్సీ పోస్టులను విడుదల చేసి ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ విషయాన్ని మర్చిపోయే వైయస్సార్ సిపి నాయకులు డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు భోజన వసతులు కల్పించి ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నీటి సమస్యను తీర్చడానికి ప్రతి గ్రామంలో వాటర్ గ్రిడ్, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేసిన ఘనత  ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి కి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మాజీ కౌన్సిలర్ మధుబాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. లేదంటే నీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

About Author