NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాము… ఈఓ

1 min read

మహానంది , న్యూస్​ నేడు:  ఈ నెల 22నుండి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాహనాది కారి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం మహానంది పుణ్యక్షేత్రం లో జరిగే ఉత్సవాల సందర్బంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఈఓ మాట్లాడుతూ 11రోజుల పాటు జరిగే ఉత్సవాలలో శ్రీకామేశ్వరీ దేవి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శన మెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యుత్ అలంకరణలతో భక్తులు ఆనంద పడేలా చూస్తామన్నారు. దసరా పండుగ రోజున ఎన్నడూ లేనివిదంగా అమ్మవారిని శివ కామేశ్వరిగా(అర్ధ నారీశ్వరిగా) అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకు ముందు కళ్యాణ మండపంలో వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, హనుమంతు శర్మ, ప్రధాన అర్చకులు అర్జున్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు జనార్దన్ శర్మ,కొమ్మొద్ధి శంకరయ్య,ప్రకాశం శర్మ, సురేంద్ర శర్మ, జనార్దన్ శర్మల ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలకు ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈకార్యక్రమంలో ఏ ఈఓ మధు,సూపర్డెన్స్ శశిధర్ రెడ్డి,నీలకంటేశ్వర రాజు, సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగ మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

About Author