కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి..
1 min read
నందికొట్కూర్ లో ప్రజాభి ప్రాయ సేకరణ..
నందికొట్కూరు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో సోమవారం ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అత్యంత నిజాయతీ పరుడు,నిస్వార్థ పరుడు ప్రజల మన్ననలు పొందిన ఏకైక దళిత ముఖ్యమంత్రి వర్యులు,గొప్ప సామాజిక సంస్కరణ కర్త,బహుజనుల ఎదుగుదలకు ఆర్థిక పునాదులు వేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు నామకరణం చేయాలని ఈ రోజు దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజల నుండి,ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సంతకాల సేకరణ చేశారు.పట్టణంలోని పటేల్ సెంటర్ దగ్గర దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి కో ఆర్డినేటర్ నాగేష్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి గౌరవ సలహాదారులు డి.రాజు,గౌరవ అధ్యక్షులు వేల్పుల సుంకన్న ,నందికొట్కూరు కాంగ్రెస్ ఇన్చార్జి తేనె.నాగరాజు కన్వీనర్లు జైపాల్,పి.ఉపాధ్యక్షులు బి.మనోహర్,ప్రధాన కార్యదర్శి అంకన్న,వి.అర్లప్ప,శివ, నాగన్న,శ్రీను,పుల్లన్న,తదితరులు పాల్గొన్నారు.

