కబ్జాలకు పాల్పడే గుణం.. టీజీ కుటుంబానికి లేదు..
1 min read
దానధర్మాలు చేయడమే వారికి తెలిసింది…
- కర్నూలును స్మార్ట్ సిటీగా మార్చడమే మంత్రి టిజి భరత్ లక్ష్యం
- దౌర్జన్యాలు, కబ్జాలు చేయడం వైసీపీకే చెల్లు..
- అందుకే ఏ,బీ,సీ క్వార్టర్లపై తప్పుడు కథనాలు
- కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి
కర్నూలు, న్యూస్ నేడు : రాష్ట్రాభివృద్ధిలో భాగంగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలును స్మార్ట్ సిటీగా మార్చాలన్న ధృఢ సంకల్పంతోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని యంత్రాంగాన్ని ఆదేశించారని, అందులో భాగంగానే కర్నూలులోని ఏ,బీ,సీ క్వార్టర్ల గుర్తించారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఏ,బీ,సీ క్వార్టర్ల కు సంబంధించి స్థలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ మంత్రి టిజి భరత్ పై తప్పుడు కథనాలు రాయించడం సిగ్గు చేటన్నారు. దౌర్జన్యాలు, కబ్జాలకు పాల్పడటం వైసీపీ నేతలకు వెన్నెతో పెట్టిన విద్య అని, అందుకే టీజీ కుటుంబంపై ఓ పేపర్ లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన ధర్మాలు చేయడమే టిజి కుటుంబానికి తెలుసునని, కబ్జాలకు పాల్పడే గుణం వారికి లేదని, కర్నూలు నగరంలోని ప్రతి పౌరుడికి వారి మంచితనం గురించి తెలుసునన్నారు. ఎవరు కబ్జాదారులో రాష్ట్ర ప్రజలకు తెలిపే వై.సి.పి. నాయకులను 11 సీట్లకు పరిమితం చేశారని ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
కర్నూలు అభివృద్ధిలో.. మంత్రి టిజి భరత్..
కర్నూలు జిల్లాను అభివృద్దిపథంలో వైపు తీసుకువెళ్లేందుకు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తున్నారని, ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తున్నారని, , ఈ కారణంగానే ఎంతో మందికి ఉ ద్యోగవకాశాలు రావడమేకాక ఎంతో మంది పారిశ్రామిక రంగానికి చెందిన వారు కర్నూలులో ఉండాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి మదరాసీ నుంచి ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుటు కర్నూలు రాజధానిగా ఉండగా అప్పటి ఉద్యోగుల సౌకర్యార్దము ఎబిసి క్యాంపులలో క్వార్టర్స్ నిర్మించారని, అయితే నేటికి కూడా ఎంతో మంది అర్హులతోపాటు అనర్హులు కూడా వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. కొన్ని క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని, ఇంకొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, అందువల్ల ప్రభుత్వం వాటిని పునర్మిణాల నిమిత్తం ఖాళీ చేయిస్తున్నారని ఈ సందర్భంగా కుడా చైర్మన్ స్పష్టం చేశారు.
అక్రమ సంపాదనకు అడ్డు అనే…తప్పుడు ఆరోపణలు…
ఏ,బీ,సీ క్వార్టర్లు ఖాళీ చేస్తామని, కొంతరు సమయం కావాలని కొందరు స్వచ్ఛందంగా కోరగా… వారికి మంత్రి టిజి భరత్ సమయమిచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రభుత్వ క్వార్టర్లలో కొందరు వైసీపీ నాయకులు అక్రమంగా నివాసం ఉంటూనే… కొన్ని క్వార్టర్లను అక్రమంగా అద్దెకు ఇచ్చారని, అక్రమ సంపాదనకు అడ్డు పడుతున్నారనే మంత్రి టిజి భరత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కుడా చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకులకు సవాల్…
కర్నూలు అభివృద్ధిలో టిజి కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ఉందన్నారు టీడీపీ నాయకులు ఆకెపోగు ప్రభాకర్, నాగరాజు యాదవ్, జిక్రియా అన్సారి. టిజి కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్న వైసీపీ నాయకుల భూ కబ్జాలు, అక్రమాలపై కొండా రెడ్డి బురుజు దగ్గర చర్చకు సిద్ధమా అని వారు సవాల్ విసిరారు. సమావేశంలో రాష్ట్ర తెలుగుయువత ఉపాద్యక్షులు సోమిశెట్టి నవీన్, రాష్ట్ర కార్యదర్శి పి. రవికుమార్ తెలుగుయువత పార్లమెంట్ అధ్యక్షులు యస్. అబ్బాస్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పి.హనుమంతరావు చౌదరి తదితరులు ఉన్నారు.

