కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం
1 min read
కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం… నియామక పత్రం అందజేసిన …
కర్నూలు, న్యూస్ నేడు: సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ శ్రీ యం. మహేష్ కుమార్ .ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఒక హోంగార్డు కుటుంబాని జిల్లా పోలీసుశాఖ అండగా నిలిచింది.విధి నిర్వహణలో ఉంటూ హోంగార్డు దాసరి మునిస్వామి (హెచ్ జి. నెం 38) అనారోగ్యంతో మార్చి 25 వ తేదిన మృతి చెందాడు.ఈయన కుమారుడు దాసరి పెద్ద స్వామి కి జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం ఇస్తూ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.ఈ సంధర్బంగా శుక్రవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హోంగార్డు నియామకం పత్రాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలోని హోంగార్డు కమాండెంట్ ఆఫీసులో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ శ్రీ యం. మహేష్ కుమార్ గారు మృతి చెందిన హోంగార్డు కుమారుడుకి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ భాస్కర్ రావు, హోంగార్డు డిఎస్పీ ప్రసాద్, ఆర్ ఐ జావేద్, జూనియర్ అసిస్టెంట్ కె. మాధవి రాణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

