కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా పిబివి సుబ్బయ్య
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ల జాబితా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు పిబివి సుబ్బయ్య రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడ గొల్లపూడి బీసీ సంక్షేమ భవనంలో ప్రమాణ స్వీకారం చేసి సంబంధిత పత్రాన్ని కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పేరేరి ఈశ్వర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింతా సురేష్ బాబు హాజరై సుబ్బయ్య ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయ/వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు తోళ్ళ మంజునాథ్ , బోయ మురళి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

