గ్రామాభివృద్ధికి నాంది పలికిన ఎమ్మెల్యే కోట్ల
1 min read

గ్రామంలో స్మశాన వాటిక కు పన్నులు ప్రారంభం
యువతకు పెన్నా సిమెంట్ కర్మాగారంలో ఉద్యోగ కల్పన
గ్రామానికి నాలుగు కిలోమీటర్ల నుంచి త్రాగు నీరు పైపు లైన్ ఉచితంగా మినరల్ వాటర్
త్వరలో ఇంటింటికి కొళాయి ప్రారంభం
ప్యాపిలి, న్యూస్ నేడు: అభివృద్ధికి నాంది పలికి న డోన్ శాసనసభ సభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నాము అని తేదేపా నాయకులు కౌలుపల్లి శివారెడ్డి, రామేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్యాపిలి మండల పరిధిలోని కౌలుపల్లి గ్రామంలో డోన్ శాసనసభ సభ్యులు కోట్ల సూర్య జయప్రకాశ్ రెడ్డి ఆధ్వరంలో మా అభివృద్ధికి ముందడుగు వేసి అభివృద్ధికి నాంది పలికారని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, ఏ ప్రజాప్రతినిధి గాని మా కౌలుపల్లి గ్రామాన్ని పట్టించుకునే పాపాన పోలేదని వారన్నారు. కౌలుపల్లి గ్రామంలో స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే కోట్ల జయసుర్య ప్రకాశ్ రెడ్డి దృష్టికి తీసుకపోగా వెంటనే ఆయన స్పందించి ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కింద స్మశాన వాటికకు నిధులు మంజూరు చేయించారు. వాటి మరమస్తులకై కంప చెట్లను తొలగించి స్మశాన వాటికలో గ్రావెల్ మట్టిని వేయించారన్నారు, అలాగే ఇది గ్రామంలోని యువతకు పెన్నా సిమెంటు కర్మాగారంలో యువతకు ఉద్యోగాలు కల్పించారన్నారు. అలాగే గ్రామానికి నాలుగు కిలోమీటర్ల నుంచి త్రాగునీరుకై 25లక్షలతో పైపులైను వేయించి గ్రామానికి నీరు సరఫరా చేయిస్తూ, ఉచితంగా మినరల్ ప్లాంట్ నుంచి శుద్ధమైన నీరు అందిస్తున్నారన్నారు. గ్రామంలో త్వరలో ఇంటింటికి కోలాయి ప్రారంభం చేస్తామన్నారు. ప్యాపిలి మండలానికి చివరగా ఉన్న మా కౌలుపల్లి గ్రామాం వెలుగులోకి వస్తుందని, ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మా గ్రామని దత్తత తీసుకొని గ్రామ అభివృద్ధి నాంది పలికరన నిదర్శనం, మా గ్రామం పై ప్రత్యేక చర్యలు తీసుకొని గ్రామ అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ, మండలానికి చివరి గ్రామం కాదు అభివృద్ధిలో ముందు గ్రామంగా నిలవాలని ఆయన సంకల్పంతో అభివృద్ధి చేయడముతో గ్రామంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఆయన గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజా సేవకుడుగా ప్రజలకు సేవలందించాలని వారు కోరారు.

