NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇండియా-ఉజ్బెకిస్థాన్ భాగ‌స్వామ్యంలో ఈ త‌ర‌హా కోర్సు ఇదే మొట్టమొద‌టిది

1 min read

హైద‌రాబాద్, న్యూస్​ నేడు : రాజ‌మండ్రికి చెందిన జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థ ఉజ్బెకిస్థాన్‌లోని ఇంప‌ల్స్ మెడిక‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్‌తో క‌లిసి సంయుక్తంగా వైద్యవిద్య కోర్సు అందిస్తున్నట్లు ఆదివారం ప్రక‌టించింది. జాతీయ వైద్య క‌మిష‌న్ (ఎన్ఎంసీ) నిబంధ‌న‌ల‌కు పూర్తిగా క‌ట్టుబ‌డుతూ ఇలాంటి కోర్సు చేప‌ట్టడం ఇదే మొట్టమొద‌టి సారి. ఉజ్బెకిస్థాన్‌లో వైద్యవిద్య చ‌ద‌వాల‌నుకుంటున్న భార‌తీయ విద్యార్థుల‌కు ఈ భాగ‌స్వామ్యం ఎంతో మేలుచేస్తుంది. దీనివ‌ల్ల వారు తిరిగి భార‌త‌దేశానికి వ‌చ్చి ఇక్కడ విజ‌య‌వంతంగా ప్రాక్టీసు చేయొచ్చు. ఇంప‌ల్స్ మెడిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లోని కోర్సులు ఎన్ఎంసీ మార్గద‌ర్శకాలు, యునైటెడ్ స్టేట్స్ మెడిక‌ల్ లైసెన్సింగ్ ఎగ్జామినేష‌న్ (ఎస్ఎస్ఎంఎల్ఈ) ప్రమాణాలు రెండింటికీ అనుగుణంగా ఉన్నాయి. క‌రిక్యులంను భార‌త్, ఉజ్బెకిస్థాన్‌ల‌కు చెందిన విద్యారంగ నిపుణులు క‌లిసి రూపొందించారు. ఇది భార‌తీయ ఎంబీబీఎస్ సిల‌బ‌స్‌, అంత‌ర్జాతీయ వైద్య ప్ర‌మాణాలకు అనుగుణంగా ఉంటూ, సీబీఎంఈ (భార‌త వైద్య‌క‌ళాశాల‌ల క‌రిక్యులం)ను పాటిస్తుంది. దీనివ‌ల్ల ఇండియా, అమెరికా, ఇంగ్లండ్, లేదా ప్రపంచంలోని మ‌రేదేశంలోనైనా ప్రాక్టీసు చేసుకోవ‌డానికి వీలుగా విదేశాల్లో చ‌దివేందుకు ఇది స‌రైన ఆప్షన్‌గా విద్యార్థుల‌కు ఉంటోంది. ఈ సంద‌ర్భంగా జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ త‌రుణ్ గోగినేని మాట్లాడుతూ, ‘‘విదేశాల్లో వైద్యవిద్య అభ్య‌సించే విద్యార్థులు ఫారిన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ (ఎఫ్ఎంజీఎల్‌) 2021 నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని ఎన్ఎంసీ సూచించింది. ఈ ప్రమాణాలు పాటించ‌ని సంస్థల్లో చ‌దివిన‌వారు ఫారిన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేష‌న్ (ఎఫ్ఎంజీఈ) లాంటి లైసెన్సింగ్ ప‌రీక్ష‌ల‌కు అర్హులు కారు. ఇందుకు బాధ్యత పూర్తిగా విద్యార్థుల‌దే అవుతుంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్ఓ), ఈసీఎఫ్ఎంజీల నుంచి ఎక్రెడిటేష‌న్, రిప‌బ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్‌కు చెందిన విద్య‌, సైన్స్, ఇన్నోవేష‌న్ మంత్రిత్వశాఖ నుంచి గుర్తింపు ఉన్న ఇంపల్స్ మెడిక‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్‌తో చేతులు క‌ల‌ప‌డం ద్వారా, జీఎస్ఎల్ మెడికల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ విద్యార్థుల‌కు సుర‌క్షిత‌మైన‌, న‌మ్మద‌గిన మార్గాన్ని జీఎస్ఎల్ మెడిక‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ చూపిస్తోంది’’ అన్నారు. ఈ భాగస్వామ్యం విద్యార్థులు స్వదేశంలో త‌మ వృత్తిప‌ర‌మైన భ‌విష్యత్తు విష‌యంలో రాజీ ప‌డ‌కుండానే త‌మ క‌ల‌లు నెర‌వేర్చుకోగ‌ల‌రు.

About Author