NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘటన స్థలిని పరిశీలించిన మంత్రులు

1 min read

కర్నూలు, న్యూస్ నేడు: అంతకముందు  కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు  ప్రమాద ఘటనా స్థలాన్ని   హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు పరిశీలించారు..ప్రమాదం ఏ విధంగా జరిగిందని  వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు… అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో  వైద్య చికిత్స పొందుతున్న  బాధితులను పరామర్శించారు..  గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రులు వైద్యులను ఆదేశించారు.  మంత్రుల వెంట డిజిపి హరీష్ కుమార్ గుప్తా, డిఐజి కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు, టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About Author