NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదాం..

1 min read

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖం

ఏ, బి, సి క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేలా సిఎం చర్చిస్త

స్మార్ట్ సిటీ పనులకు సైతం వినియోగం

మెడికల్ కాలేజీ షాపులపై కోర్టు తీర్పు అమలు

నగరపాలక అధికారుల సమీక్షలో మంత్రి టీజీ భరత్

కర్నూలు, న్యూస్​ నేడు:  బుధవారం కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ, అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. బుధవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో కమిషనర్ పి. విశ్వనాథ్‌తో కలిసి అన్ని విభాగాల అధికారులు, అమినిటీస్ కార్యదర్శులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు.ముందుగా నగరంలో రూ.12.62 కోట్లతో జరుగుతున్న 62 అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్ల వారీగా సమీక్ష నిర్వహించారు. జాప్యం జరుగుతున్న పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కర్నూలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రగతిలో ముఖ్య స్థానాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్  ఏర్పాటుకు సుముఖంగా ఉందని, దీన్ని నగర శివార్లలో కాకుండా ఏ, బి, సి క్యాంపుల్లో ఏర్పాటు చేసే అంశంపై ఇటీవల విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు వెల్లడించారు. తరువాత రహదారుల విస్తరణ, పారిశుద్ధ్యం, టిడ్కో గృహాలు, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతి తదితర అంశాలపై నగరపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు.సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ఇన్‌చార్జ్ ఎస్‌ఇ శేషసాయి, ఆర్ఓలు జునైద్, స్వర్ణలత, వాజిద్, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, ఎంఈ మనోహర్ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష తదితరులు పాల్గొన్నారు.

About Author