NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీటిలో దళితవాడ… పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు

1 min read

చెన్నూరు, న్యూస్ నేడు:   మండలంలోని శేషయ్య గారి పల్లి దళితవాడ నాలుగు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో వీధుల్లో వర్షపు నీటితో నిండిపోయింది. కొన్ని ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో 49వ డివిజన్ లో2 వార్డు శేషయ్య గారి పల్లి. పేరుకు కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. రోడ్లు డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చిన వీధులు జలమయం అవుతున్నాయి. శేషయ్య గారి పల్లి దళితవాడ లోతట్టు ఇళ్లల్లోకి వర్షం నీరు  చేరడంతో వారు పడుతున్న ఇబ్బందులు వర్తనాతితం ఈ విషయంపై దళితవాడ ప్రజలు కడప కార్పొరేషన్ అధికారులకు చెప్పుకోవాలంటే వారు పట్టించుకోవడంలేదని దళితవాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శేషయ్య గారి పల్లి దళిత వాడను అధికారులు సందర్శించి తమకు రోడ్లు డ్రైనేజీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.

About Author