NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండు రోజుల్లో నివేదికలు సిద్ధం చేయండి

1 min read

మహానంది,  న్యూస్​ నేడు:  రెండు రోజుల లోపల పంట నష్ట అంచనాల నివేదికలు సిద్ధం చేయాలని  రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల నుండి ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే మహానంది మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి మహానంది మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. క్రింది స్థాయి సిబ్బంది క్షేత్ర పరిశీలనకు వెళ్లాలని ఆదేశించారు. కానీ వారికి కొన్ని అడ్డంకులు కొన్ని చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. వరి ,మొక్కజొన్న ఇతర పంటలు నీటిలో మునిగి ఉండడంతో పాటు కింది స్థాయి సిబ్బంది వెళ్లి పరిశీలన చేయడానికి కూడా నీటి ప్రవాహ ఉధృతి ఇంకా పంట పొలాల్లో కొనసాగుతూ ఉండడంతో  కష్టతరంగా మారినట్లు సమాచారం. వాగులు వంకల్లో నీటి ప్రవాహం తగ్గితే పంట పొలాల్లో కూడా నీరు తగ్గే అవకాశం ఉన్న కొన్ని పొలాల్లో కొన్ని రోజులపాటు అలాగే నీరు నిలువ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా నివేదికలు సిద్ధం చేయాలని రెండు రోజుల లోపల ఉన్నత స్థాయి అధికారులకు నివేదికలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తుంది. ఆ దిశగా అధికారులు మరియు సిబ్బంది క్షేత్రస్థాయిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ ను సిద్ధం చేసి వాటి ద్వారా పంట దెబ్బతిన్న ప్రాంతాలను ఫోటోలు తీసి  సందేశాలు పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. క్రింది స్థాయిలో పరిశీలన, పర్యవేక్షణ, నివేదికల అనంతరం మండల స్థాయి, డివిజన్ మరియు జిల్లా స్థాయి అధికారులు పునః పరిశీలించే అవకాశం తెలుస్తుంది. పరిశీలన అనంతరం  లోటుపాట్లను సవరించి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయ సహకారాలు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

About Author