(టీసీఐ) క్యూ2 ఎఫ్ వై2026లో బలమైన వృద్ధిని నమోదు చేసింది
1 min read
గురుగ్రామ్, న్యూస్ నేడు : భారతదేశంలోని ప్రముఖ సమగ్ర మల్టీమోడల్ లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీసీఐ), 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికం (క్యూ2 ఎఫ్ వై2026)కు సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.ఈ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం ₹12,174 మిలియన్లు నమోదు చేయగా, ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని ₹11,314 మిలియన్లతో పోలిస్తే 7.6% వృద్ధిని సూచిస్తుంది. ఏబిటా ₹1,624 మిలియన్లకు చేరి 6.9% వృద్ధిను సాధించింది. పన్ను తర్వాత లాభం (పీఏటి) ₹1,135 మిలియన్లుగా ఉండి, గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 5.8% పెరుగుదలను చూపించింది. రైలు మరియు తీరప్రాంత సేవలు గ్రీన్ లాజిస్టిక్స్ పరిష్కారాలను వేగంగా విస్తరిస్తున్నాయి.అదనంగా, టీసీఐ-ఐఐఎం బెంగళూరు ల్యాబ్ అభివృద్ధి చేసిన ట్రాన్స్పోర్టేషన్ ఎమిషన్స్ మెజర్మెంట్ టూల్ (టిఈఎంటి) ను ఇప్పుడు డిపిఐఐటి అధికారికంగా స్వీకరించింది.టీసీఐ సుస్థిర, సాంకేతికత ఆధారిత మరియు పర్యావరణానుకూల లాజిస్టిక్స్ సేవలలో భారతదేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.

