NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టెట్ పరీక్ష 2010 కన్నా ముందు  ఉన్న ఇన్ సర్వీస్ టీచర్స్ కు మినహాయింపు ఇవ్వాలి

1 min read

దేశంలోని కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది

రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేయడానికి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాo

 వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్

ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: టెట్  పరీక్ష 2010 కన్నా ముందే ఉన్న ఇన్ సర్వీసెస్ టీచర్స్ కు మినహాయింపు ఇవ్వాలని,దేశంలోని కొన్ని రాష్ట్రాలులో సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది,రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటేషన్ వెయ్యడానికి ముందుకు రావడానికి స్వాగతిస్తున్నామన్నారు.ఇప్పటికే 25,30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అదేవిధంగా 55 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అనేకమంది ఉపాధ్యాయులు ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.సర్వీసులోకి వచ్చే ముందే బిఈడి,డిఈడి  చదివి అర్హత సాధించి, డీఎస్సీ రాసి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు 25, 30 సంవత్సరాల ఇలాంటి పరీక్షలు రాయడానికి ఏ విధంగా సన్నద్ధంగా ఉంటారు. చాలామంది సీనియర్ ఉపాధ్యాయులకు కంప్యూటర్ పై అనుభవం లేదుసిబిటి  ద్వారా నిర్వహించే పరీక్షలో సీనియర్ ఉపాధ్యాయుల ఇబ్బంది పడే అవకాశం ఉందన్నరు.ఏ చట్టమైనా దేశంలో గాని, ప్రపంచంలో గాని, చట్టం అమల్లోకి వచ్చిన తేదీ తర్వాత చట్టం అమలు చేయబడుతుంది. దేశంలో 2009 విద్య హక్కు  చట్టం ద్వారా 2011 నుండి మన రాష్ట్రంలో టెట్ ఏర్పాటు చేసి 2012లో మొదటి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 2010 కంటే ముందు ఈ సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చినట్లు అప్పటి ప్రభుత్వం కూడా జీవో ఇవ్వడం జరిగింది. అయితే మరల 2025 సెప్టెంబర్ 1న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం,  2010 కంటే ముందుగా నియామకము పొందిన ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా టెట్ రాయాలని, దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ సర్వీస్టీచర్స్ కి అవకాశం కల్పిస్తూ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ పక్షాన మేము అయితే ఒకటే కోరుతూ ఉన్నాం. అనేకమంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు  మానసిక ఒత్తిడికి గురికాకుండా, ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన కోరుతున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ఒక ప్రకటనలో  తెలిపారు.

About Author