NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెట్నహల్లి లో 36 గృహ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతి

1 min read

డిప్యూటీ ఎంపీడీవో రామాంజనేయులు

మంత్రాలయం న్యూస్ నేడు : ప్రభుత్వం నుంచి 36 గృహ నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు డిప్యూటీ ఎంపీడీవో రామాంజనేయులు తెలిపారు. గురువారం మండల పరిధిలోని చెట్నిహల్లి గ్రామంలో టిడిపి నాయకులు చేపల నాగేష్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి ఇళ్ల పట్టాలు కలిగిన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు సొసైటీ డైరెక్టర్ చేపల నాగేష్ మాట్లాడుతూ టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలు కలిగిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారని తెలిపారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టాలని లేని పక్షంలో పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మహేష్  హౌసింగ్ ఎఈ వీరేంద్ర, ఇంజనీరింగ్ అసిస్టెంట్ భవానీ, గ్రామ పెద్దలు మేకల మల్లేష్ పూజారి మల్లేష్ వీరేష్, విద్య కమిటీ చైర్మన్ పరమేష్, నరసింహులు డీలర్లు గోపాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author