శ్రీశైలంలో ..నిత్యకళారాధన..
1 min read
శ్రీశైలం, న్యూస్ నేడు: దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (30.10.2025) శ్రీ దుర్గాదేవి కూచిపూడి అండ్ భరతనాట్యం ఆర్ట్ అకాడమీ, యాదాద్రి, భువనగిరి జిలా వారిచే సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్యకార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమములో వినాయకప్రార్థన, మూషికవాహన, తాండవ నృత్యం, అఖిలాండేశ్వరి, శంభో శివశంభో ఓం నమశ్శివాయా, ప్రణవాలయ, అఖిలాండేశ్వరి, ఓంకారరూపిణి, శంభో శివశంభో తదితర గీతాలకు రామదుర్గ, శశాంక్, అమూల్య, హరిప్రియ శుశ్రుత, సూర్య తదితరులు నృత్యప్రదర్శన చేయనున్నారు. కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

