అశ్విని’లో గైనకాలజిస్టులకు ‘ హిస్టెరోస్కోపి’ పై శిక్షణ
1 min read

మహిళల ఆరోగ్యం కోసం ఆధునిక పద్దతులు అవసరం..
ప్రముఖ వైద్యులు డా. వినాయక్ మహాజన్, డా. ప్రమీల
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : అశ్విని ఆసుపత్రి, కర్నూలు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గైనకాలజిస్టుల కోసం హిస్టెరోస్కోపీ శిక్షణా శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరం ద్వారా వైద్యులు డయగ్నొస్టిక్ మరియు ఆపరేటివ్ హిస్టెరోస్కోపీ పద్ధతులపై ప్రాయోగిక శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో పూణెకు చెందిన ప్రముఖ నిపుణుడు డా. వినాయక్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యక్ష శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆయన ఆధునిక పరికరాలు, సురక్షిత శస్త్రచికిత్స పద్ధతులపై సూచనలు అందించారు. అనంతరం అశ్విని హాస్పిటల్ గైనిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ “మహిళల ఆరోగ్య సంరక్షణలో ఆధునిక శస్త్రచికిత్స పద్ధతులు నేర్చుకోవడం చాలా అవసరం. ఆ దిశగా ఈ శిబిరం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అశ్విని ఆసుపత్రి నిర్వహక బృందం ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ సహకారం అందించిన అతిథి అధ్యాపకులు, పాల్గొన్న వైద్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.



