NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేయండి

1 min read

కేంద్ర, రాష్ట్ర పథకాలు రైతులకు వివరించండి

దేశీ ఇన్ ఫుట్ డీలర్లకు అవగాహన కల్పించిన  ఏడీ ఎంఏ.ఖాద్రి

కర్నూలు, న్యూస్ నేడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు రైతులకు వివరించాలని, రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని  దేశీ ఇన్ఫుట్ డీలర్లకు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎంఏ ఖాద్రి సూచించారు. ఆదివారం కలెక్టరేట్ లోని వ్యవసాయ శాఖ సమావేశ భవనంలో ఫెసిలిటేటరు జె.సి. నాగేంద్రయ్య అధ్యక్షతన ఇన్ పుట్ డీలర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యకరమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏడి ఎంఏ ఖాద్రీ మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  వ్యవసాయ సంబంధి పథకాల గురించి వివరించారు. ముఖ్యంగా  కేంద్ర  పథకాలైన  ప్రధానమంత్రి కిసాన్ సమ్మున్ లు నిధి, ప్రధానమంత్రి  ఫసల్ భీమా యోజన, పి.ఎం. కృషి సించాయి యోజన,  జాతీయ ఆహర భద్రతా మిషన్ మొదలగునవి మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన డిజిటల్  క్రాప్ బుకింగ్, అన్న దాంత సుఖీభవ, పొలంబడి, వ్యవసాయ యాంత్రీకరణ, సి.యమ్.యస్ ) ఇంటి గ్రేటెడ్ అగ్రి లాబ్స్, మినికిట్స్, పాడి పంటలు,  మాగజైన్, పొలం పిలుస్తుంది రా  తదితర  పథకాలను ఏడీ ఎంఏ ఖాద్రి డీలర్లకు స్పష్టంగా వివరించారు. కార్యక్రమంలో ఫెసిలిటేటరు జె.సి. నాగేంద్రయ్య, ఆత్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author