NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్య సేవ వద్దు… అవినీతి  ముద్దు

1 min read

చంద్రబాబు పాలన తీరు పై ఆగ్రహించిన వైసీపీ నేతలు …నరేన్ రామానుజుల రెడ్డి సత్య సాయినాథ్ శర్మ ,రాజోలు వీరారెడ్డి

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగిన కమలాపురం

వేలాదిమంది తో  ర్యాలీ , ప్రభుత్వానికి లేదు జాలి…….         

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పై .దుమ్మెత్తిన వైసిపి నేతలు

కమలాపురం న్యూస్ నేడు : నియోజకవర్గ కేంద్రమైన కమలాపురంలో బుధవారం నాడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ  చేస్తున్నందుకు నిరసనగా వైసిపి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి ,వైసిపి రాష్ట్ర ఎస్ ఈ సి సభ్యులు కాశీభట్ల  సత్య సాయినాథ్ శర్మ ,రాజోలి వీరారెడ్డి , మండల కన్వీనర్ లు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ భారీ స్థాయిలో విజయవంతమైంది .కమలాపురం చావిడి వద్ద నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీ కొనసాగింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల  ప్రైవేటీకరణ  వ్యతిరేక నినాదాలతో కమలాపురం పట్టణం దద్దరిల్లింది.బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎటు చూసినా వైసిపి నాయకులు కార్యకర్తలే కమలాపురం పట్టణంలో కనిపించారు. వైసిపి నాయకులు కార్యకర్తలు  గుంపులు గుంపులుగా తరలి రావడంతో కమలాపురం వైసీపీ మయమైంది .కమలాపురం చావిడి వద్ద నుంచి 10:45 గంటలకు ర్యాలీ ప్రారంభమైంది.వైసిపి నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజల నుంచి విశేష సంఖ్యలో స్వచ్ఛందంగా భారీ మద్దతు లభించింది  వైసిపి నాయకులు ఊహించిన దానికంటే విశేష సంఖ్యలో ప్రజలు ర్యాలీకి మద్దతు పలికారు.కమలాపురం నియోజకవర్గంలోని కమలాపురం చెన్నూరు పెండ్లిమర్రి చింతకొమ్మదిన్నె వీరపునాయన పల్లి వల్లూరు పెండ్లిమర్రి మండలాల నుంచి భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ  ఆలోచన విధానాన్ని వెంటనే విరమించుకోవాలని కోరుతూ కమలాపురం డిప్యూటీ తహసిల్దార్ జ్యోతి కి వినతి పత్రం సమర్పించారు.అనంతరం వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన సాధించని మెడికల్ కాలేజీ లను జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలను తెచ్చాడన్నారు .కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాల కన్వీనర్లు ఉత్తమ రెడ్డి ప్రభాకర్ రెడ్డి  రమణారెడ్డి చీర్ల సురేష్ యాదవ్ వీరారెడ్డి ,మండల  జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు మండల అధ్యక్షులు ఉప మండల అధ్యక్షులు భారీ స్థాయిలో వైసిపి నాయకులు కార్యకర్తలు మహిళలు జిల్లా మండలాల పార్టీ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు .

About Author