NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

1 min read

నూజివీడు లబ్ధిదారులకు తాళాలు,నూతన వస్త్రాలు అందించి  గృహప్రవేశాల కార్యక్రమం లో జిల్లా కలెక్టర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్రంలో 3 లక్షల నిరుపేదల నూతన  గృహప్రవేశాలలో  ‘మన ఇల్లు – మన గౌరవం’కార్యక్రమంలోగా భాగంగా ఏలూరు జిల్లాలో నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు పట్టణం 25వ వార్డ్ గాంధీ నగర్ లోని లబ్ధిదారు  తురకా అంకమ్మ   గృహ ప్రవేశ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం పాల్గొన్నారు. గృహ ప్రవేశం అనంతరం కుటుంబ సభ్యులతో గృహ ప్రవేశ పూజలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రములను కలెక్టర్ అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక్కరోజే  3 లక్షల నిరుపేదల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తున్నది, దీనిలో భాగంగా జిల్లాలో బుధవారం ఒక్కరోజే  15,024 నూతన గృహములకు గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నారు.  కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ రామినేని త్రివేణి దుర్గ, వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, మునిసిపల్ కమీషనర్ పేరయ్య, గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, స్థానిక కౌన్సిలర్  పాదం సీతాదేవి, తహసీల్దార్, పట్టాన ప్రముఖులు జగదీశ్, గోళ్లు దుర్గాదేవి, పాదం సత్యనారాయణ, కృష్ణకుమారి, కామేష్, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author