NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్ వైర్లు మరమ్మతులు..

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద గ్రామంలోని 4వ వార్డుల్లో కొన్ని సంవత్సరాల నుండి విద్యుత్ వైర్లు చాలా క్రిందకు ఉండడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అలాగే కొద్ది రోజుల క్రితం గడ్డి ట్రాక్టర్  వస్తుండగా  విద్యుత్ వైర్లు తగిలి గడ్డి మొత్తం కాలిపోయింది. ఈ సమస్యను గుర్తించి ఎస్ డి సి ఐ సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వార్డు మెంబర్ ఎఫ్. అబ్దుల్ హమీద్, పార్టీ కార్యకర్తలు మరియు కాలనీ వాసులు కలిసి కరెంట్ ఆఫీసుకు అర్జీ ఇవ్వడం జరిగింది. వారు ఈ సమస్యను గుర్తించి కొత్త సిమెంటు స్తంభాన్ని పూడ్చి వైర్లను బిగించి సమస్యను పరిష్కరించారు. ఈ సమస్యను పరిష్కరించినందున  ఎస్డీపిఐ  పార్టీ కార్యకర్తలు మరియు కాలనీ వాసులు కృతఙ్ఞతలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో 4వ వార్డు మెంబర్ ఫి. అబ్దుల్ హమీద్, 8వ వార్డు మెంబర్ . అబ్దుల్ రెహ్మాన్, 9వ వార్డు మెంబర్ ఎన్​. సుభాన్, ఎస్ డిపి పార్టీకార్యకర్తలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

About Author