రామ తారకమంత్రం భక్తిముక్తిసాధకం
1 min read

ఆస్పరి, న్యూస్ నేడు: మనందరిలో రమించే దివ్యచైతన్యమే శ్రీరామచంద్రుడని, రామనామ స్మరణ సకల మానవులకు ఇహపరసాధకమని, భక్తి, ముక్తి సాధకమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆస్పరి మండలం, కారుమంచి గ్రామంలోని శ్రీజ్యోతి మూర్తి సిద్ధాశ్రమం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలను వారు ప్రారంభించారు. తదనంతరం ప్రసిద్ద నాటకరంగ కళకారులు పాయసం పెద్దరంగారెడ్డి శ్రీమద్రామాయణంలోని ఆదర్శ గుణాలగురించి ప్రవచించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ ప్రచార మండల సభ్యులు న్యాయకంటి భీమిరెడ్డి, సోమేశ్వరరెడ్డి,కాపు రవిప్రకాశ్ రెడ్డి,శివయ్య, జె. సత్యనారాయణరెడ్డి, కె. ఈరన్న, యం. తిమ్మప్ప, జయకృష్ణ, రంగస్వామి, సుధాకర్, సిద్ధప్ప బీరప్ప, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

