PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా పరిషత్ లో పదోన్నతులు … కారుణ్య నియామకాలు

1 min read

వివిధ హోదాలలో పలువురికి నియామక పత్రాలు

కృతజ్ఞతలు తెలియజేసిన పదోన్నతి,కారుణ్య నియామక ఉద్యోగులు

సమిష్టి కృషితో పనిచేసే జిల్లా పరిషత్ కి మంచి పేరు తీసుకొద్దాం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు:  2023 న నేను జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులుగా భాద్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు జిల్లా ప్రజా పరిషత్ అధీనంలో వివిధ కెడర్లలో పని చేయుచున్న సిబ్బందికి ఈ క్రింది విధముగా పదోన్నతులు కల్పించడమైనది. పదోన్నతులు ఆఫీస్ సబార్దినేట్ నుండి రికార్డు అసిస్టెంట్ /ల్యాబ్/లైబ్రరీ అసిస్టెంట్ గా10, రికార్డు అసిస్టెంట్ /ల్యాబ్/లైబ్రరీ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ గా 07,జూనియర్ అసిస్టెంట్/ టైపిస్ట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ గా 23 ,సీనియర్ అసిస్టెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా                      21,  కారుణ్య నియామకాలు కారుణ్య నియామకం ద్వారా జూనియర్ సహాయకులు గా నియమింపబడిన వారు19, కారుణ్య నియామకం ద్వారా టైపిస్ట్లు గా నియమింపబడిన వారు 30,కారుణ్య నియామకం ద్వారా ఆఫీస్ సబార్దినేట్ గా నియమింపబడిన వారు06, కారుణ్య నియామకం  ద్వారా 55 మందిని ఒకేసారి నియమించడం రాష్ట్ర చరిత్రలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధమ స్థానంలో ఉంది. ఉద్యోగులు అఖస్మత్తుగా మరణించడం వలన వారి యొక్క కుటుంబాలు మరియు కోవిడ్ సమయంలో మరణించడం వలన  వారి కుటుంబాలు చిన్నబిన్నమై అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం  వారసులకు ఉపాది కల్పించడం జరుగుతుందన్నరు.          నేను పదవి భాద్యతలు చేపట్టిన వెంటనే ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న రికార్డు అసిస్టెంట్ /ల్యాబ్/లైబ్రరీ అసిస్టెంట్ ల పదోన్నతులు కల్పించాము. అంతేకాకుండా మరణించిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకం  ద్వారా – జాబితాను ఎప్పటికప్పుడు భర్తిచేయడం కొరకు చర్యలు చేపట్టడం జరుగుతున్నది.            పై పేర్కొన్న అన్ని కెడర్ల వారికి ఖాళీలు ఏర్పడిన వెంటనే పదోన్నతులలో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా కల్పించాము. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులను భర్తిచేయడం ద్వారా పదోన్నతి పొందినవారు మరింత ఉత్సాహంతో తమ విధులు నిర్వర్తించ గలుగుతారని భావిస్తున్నాను.ఇక ముందు కూడా ఖాళీలు ఏర్పడిన వెంటనే పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్రంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాను ప్రధమ స్థానంలో నిలుపుతానని, మనమంతా సమిష్టి కృషితో పనిచేసి జిల్లా పరిషత్తుకు మంచి పేరు తీసుకొద్దామని ఒక ప్రకటనలో తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *