ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read

ధర్మాచరణము ద్వారానే వ్యక్తి వికాసము సమాజాభ్యుదయము
డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే.
ఆస్పరి, న్యూస్ నేడు: ధర్మాచరణం ద్వారానే వ్యక్తి వికాసంతోపాటు సమాజ అభ్యుదయం జరుగుతుందని, ధర్మాచరణమే సర్వాంగీన వికాసానికి కారణభూతమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మా ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆస్పరి మండలం, కారుమంచి గ్రామంలోని శ్రీ జ్యోతిమూర్తి శ్రీశ్రీశ్రీ దక్షిణామూర్తి స్వామి ఆశ్రమం నందు గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు గ్రామములో శోభాయాత్రగా నగర సంకీర్తన నిర్వహించారు. మూడు రోజులు పాటు ప్రముఖ రంగస్థల కళాకారుడు పాయసం పెద్ద రంగారెడ్డి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో తితిదేధర్మ ప్రచారమండలి సభ్యులు న్యాయకంటి భీమిరెడ్డి, సర్పంచ్ సి.లక్ష్మిదేవి కౌలుట్ల, మాజీ జడ్పిటిసి మురళీమోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు కె.రవి ప్రకాశ్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, ఈరన్న, రంగయ్య, దేవేంద్ర, రంగస్వామి, సత్యనారాయణ రెడ్డి, గోవిందు, సుధాకర్ స్వామి, హరీష్ గౌడ్, మల్లి గౌడ్, లక్ష్మీదేవి, శ్రీవారి సేవకులు సోమిరెడ్డి, రాధారెడ్డి, అరుణ, లలిత, లక్ష్మి, అనుపమ, శ్రీదేవి నాగరత్నమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


