నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు
1 min read

-ఓ.జే.టి త్రీ మెన్ కమిటీ సభ్యులు.
కర్నూలు, న్యూస్ నేడు: కె.వి.ఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థినులకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా నేడు నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన నైపుణ్య శిక్షణ – ఉద్యోగ అవకాశాలు పై అవగాహన కార్యక్రమంలో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ త్రీ మెన్ కమిటీ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు భవిష్యత్తులో కెరీర్ అభివృద్ధికి తోడ్పడుతాయన్నారు. నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పొందడంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని, డిజిటల్ నైపుణ్యాలు ఉంటే ఆన్లైన్ ఉద్యోగ అవకాశాలు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేసుకునే అవకాశాలు పొందవచ్చు అన్నారు .త్రీ మెన్ కమిటీ మెంబర్లు అధ్యాపకులు మల్లికార్జున, సోమేశ్ లు మాట్లాడుతూ నైపుణ్యాల ద్వారా సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని బహుళ రంగ సంస్థల లో పనిచేసే అవకాశాలు లభిస్తాయి అన్నారు. కార్యక్రమంలో కె.వి.ఆర్ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఎస్వీ నాగిరెడ్డి, బి .జ్యోతి, ట్రైనర్ రాయపాటి నాగలక్ష్మి పాల్గొన్నారు.అనంతరం శిక్షణ ముగించుకున్న 30 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

