NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్య విద్యార్థులకు ఎమోషన్స్( భావోద్వేగాల) విషయంలో బ్యాలెన్స్ అవసరం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  వైద్య విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య పాత్ర ఎంతో ముఖ్యం మైనదని వారు భావోద్వేగాల విషయంలో బ్యాలెన్స్ గా వ్యవహరించాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గాలరీ గ్యాలరీలో నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదేశాల మేరకు మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు  ఎమోషన్స్ అసెస్మెంట్ ఇన్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్ ” ఈజ్ ” కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల చదువుల విషయం లో  క్రమ పద్ధతిలో సిలబస్ పూర్తి చేసుకోవడం, ఏ రోజు సబ్జెక్టు ఆ రోజు పూర్తి చేసుకోవడం, మెంటార్స్ ను తరుచూ   కలవడం అవసరమని  తెలిపారు. వైద్య విద్యార్థులు మానసిక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏ చిన్నపాటి మానసిక సమస్యలు వచ్చినా వెంటనే మెంటార్స్ ను సంప్రదించాలని కా లేజి పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సైకియాట్రి విభాగపు అధిపతి డాక్టర్ నాగేశ్వరావు మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు సైకియాట్రి విభాగం విభాగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు, ఇబ్బందుల విషయంలో వెంటనే తమ విభాగాన్ని సంప్రదించాలని కోరారు. ఈజ్ మాస్టర్ ట్రైనర్ డా నెల్సన్ వినోద్ మోజెస్ విద్యార్థుల్లో తరచుగా వచ్చే మానసిక ఆరోగ్య ఇబ్బందులు, వాటిని అధిరోహించడం ఎలా, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఆత్మహత్యల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్స్ డాక్టర్ సోమశేఖర్ డాక్టర్ యతిరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author