వైద్యులు చేస్తున్న పరీక్షలు పరిశీలించిన ఎమ్మెల్యే కేఈ
1 min read
వైకల్యం ప్రతిభకు అడ్డుకారాదు
ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలు ఏర్పాటు
తల్లిదండ్రులు వారిలో మానసిక ధైర్యాన్ని పెంపొందించాలి
ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు.
పత్తికొండ , న్యూస్ నేడు : వైకల్యం వారి ప్రతిభకు అడ్డుకారాదని ఎమ్మెల్యే కే.ఈ శ్యాం బాబు అన్నారు. మంగళవారం పత్తికొండ భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాల పిల్లలకు వైకల్యపు పరీక్షల ప్రత్యేక క్యాంప్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా వేద క్రీడల్లో ప్రతిభ చూపిన ప్రత్యేక అవసరాల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. వైకల్యం ఉన్న పిల్లలను సమాజంలో ఒకరిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ అందిస్తుందన్నారు. ఈ కేంద్రాల్లో వారి లోపాలకు అనుగుణంగా వారికి ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు కూడా వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే దిశగా ప్రోత్సహించాలన్నారు. అంతేకాకుండా అలాంటి విద్యార్థుల వైకల్యాలను పరీక్షలు ద్వారా గుర్తించి వారికి అవసరమైన పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. ఆ విద్యార్థులకు సేవలందిస్తున్న భవిత కేంద్రాల నిర్వహకులు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ బిఎన్ లోకరాజు,జిల్లా సహిత విద్యా కోఆర్డినేటర్ సురేంద్ర బాబుజి,ఎంఈఓలు రాజా రామ్ మోహన్, రమేష్, ఐఈఆర్టీలు శ్రీనివాసులు, తేజ కుమార్, టిడిపి నాయకులు తదితరులు ఉన్నారు.


