NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జెండర్ సమానత్వంపై విస్తృత ప్రచారం

1 min read

సమాజంలో స్త్రీలు పురుషులు సమానత్వమే టిడిపి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్

పత్తికొండ , న్యూస్​ నేడు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మహిళ సంఘాల ఆధ్వర్యంలో జెండర్ సమానత్వం కోసం జాతీయ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తికొండ మండల పరిధిలోని నలకదొడ్డి టిడిపి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ మంగళవారం ఎమ్మెల్యే కేఈ.శ్యామ్ కుమార్,టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ ల ఆదేశాల మేరకు మంగళవారం గ్రామంలో మహిళ సంఘాలతో కలిసి ప్రచార రాలిని నిర్వహించారు.ఈ సందర్భంగా బతిన రాజశేఖర్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీలు పురుషులు సమానత్వమని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గ్రామంలో తెలియజేయాలని సమాజానికి సమానత్వ సందేశాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు,నాగరాజు అంగన్వాడీ కార్యకర్త మర్యంబి మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author