NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరుజిల్లా అధ్యక్షులుగా బడేటి ఎన్నికపై హర్షం వ్యక్తం

1 min read

హర్షం వ్యక్తం చేసిన ఉమ్మడి జిల్లాల జడ్పీ  చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ హర్షం వ్యక్తం

మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్ష

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)  నియమితులవ్వడం పట్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ పట్ల నిబద్ధతతో, ప్రజాసేవలో అనుభవం కలిగిన నాయకుడైన  బడేటి రాధాకృష్ణయ్య  నాయకత్వంలో ఏలూరు జిల్లా తెలుగు దేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా, పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో చంటి కీలక పాత్ర పోషిస్తారని ఆమె అన్నారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన కృషి మరింత విస్తృతంగా కొనసాగాలని కోరుకుంటూ, ఈ నియామకం పార్టీకి, జిల్లాకు శుభప్రదమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణయ్య (చంటి)కి ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author