ఆలూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 21న వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు జన్మదిన వేడుకలు
1 min read

ఆలూరు న్యూస్ నేడు: వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఈ నెల అనగా 21వ తేదిన ఆలూరు మండల కేంద్రం లో ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఆధ్వర్యంలో మొలగవల్లి క్రాస్ నుండి ఆలూరు అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ మరియు ఆర్అండ్బి గెస్ట్ హౌస్ నందు భారీ కేక్ కటింగ్ నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బూసినే వెంకటేష్ మరియు బూసినే శ్రీ రాములు యువనేత రాష్ట్ర యువజన విభాగ సెక్రెటరీ బూసినే చంద్రశేఖర్ హాజరు అవుతారు.కావున వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా ఉపాధ్యక్షులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.సమయం : 21 వ తేది న ఉదయం 10:00 గంటలకు అందరు మెలగవల్లి క్రాస్ దగ్గర కు వచ్చి బైక్ ర్యాలీ నీవిజయవంతం చేయాలని కోరారు.

