మాళ మల్లేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ సీనియర్ నాయకులు
1 min read

హోలగుంద న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ,కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ , టీడీపీ సీనియర్ నాయకులు ఈ.గోవింద్ గౌడ్, విష్ణు వర్ధన్ రెడ్డి,తదితరులు శుక్రవారం అమావాస్య సందర్భంగా దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమానికి ప్రతినెల రూ.15000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ వీరనాగప్ప,మండల ,కమిటీసభ్యులు, మైనారిటీ మండల అధ్యక్షులు మొయిన్,టిడిపి నాయకులు వీరన్న గౌడ్,లోకేష్ నాయక్ హుస్సేన్ పీరా దీదీ నాగప్ప సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.

