లీ హెల్త్ డొమైన్,లీ ఫార్మా అధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
1 min read
ప్రతి వ్యక్తి నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.
ఆరోగ్యమైన జీవన శైలిపై దృష్టి పెట్టాలి.
ఎముకల పటిష్టంపై శ్రద్ద తీసుకోవాలి
లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి.
ఇచ్చాపురం,శ్రీకాకుళం , న్యూస్ నేడు : హెల్త్ డొమైన్, లీ ఫార్మా లిమిటెడ్, జేసీఐ ఇచ్చాపురం సహకారంతో శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురంలో సంయుక్తంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో, ఆంత్రోపోమెట్రిక్ కొలతలు, చేతి పట్టు బలం, శరీర కూర్పు, ఎముకల ఖనిజ సాంద్రత, డాక్టర్ కన్సల్టేషన్ మరియు పోషకాహార నిపుణుల కన్సల్టేషన్ వంటివి నిర్వహించారు. డాక్టర్లు మరియు పోషకాహార నిపుణులు నివేదికలను పరిశీలించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి వైద్య సలహాలు మరియు పోషకాహార మార్గదర్శకాలను అందించారు. ఈ సందర్భంగా లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలా రాణి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు,ఎముకల గట్టిదనాన్నికి ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్నారు. ఈ కార్యక్రంలో క్యాంప్ కోఆర్డినేటర్లు సరోజిని , జయలక్ష్మి , డాక్టర్ ఆర్థోపెదిక్ వెచా సంతోష్ , పోషకాహార నిపుణురాలు మాధురి, జి.ఎన్.ఎం భాగ్యలత మరియు లీ ఫార్మా బృందం పాల్గొన్నారు.

