NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వడ్డేమాన్ లో’స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’లో ఎమ్మెల్యే

1 min read

విద్యార్థులతో కలిసి పల్స్ పోలియో ర్యాలీ..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డెమాను గ్రామంలో శనివారం ఉదయం ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛఆంధ్ర’ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు అధికారులు పాల్గొని కాలనీల్లో శుభ్రంగా ఉండేందుకు చెత్త చెదారాన్ని తొలగించారు.ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం వేయడం వల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉందని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు సహకారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే అన్నారుగ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు సహకారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే అన్నారు.తర్వాత ఈరోజు ఆదివారం జరిగే పల్స్ పోలియో చుక్కల గురించి అధికారులు విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలోడిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి,మండల కన్వీనర్ కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ,తహసిల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవో రంగనాయక్,సత్యం రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి,సర్పంచ్ రామచంద్రుడు,పంచాయతీ కార్యదర్శి వి సుబ్బారెడ్డి మరియు ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author