NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన ర్యాలీ

1 min read

ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో కార్యక్రమం

ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం వినియోగించుకోవాలి

పర్యవేక్షక ఇంజనీర్ పి.సాల్మన్ రాజు

ప్రభుత్వ శాఖల నుండి తమకు అవసరమైన సమాచారాన్ని పొందే హక్కు ఈ చట్టం కల్పిస్తోంది

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్ )పర్యవేక్షక ఇంజనీరు పి.సాల్మన్ రాజు  ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన ర్యాలీ సర్కిల్ కార్యాలయం, విద్యుత్ భవన్, ఆర్.ఆర్.పేట, ఏలూరు నుండి నిర్వహించబడింది. ఈ సందర్భంగా పర్యవేక్షక ఇంజనీరు వారు మాట్లాడుతూ, ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం – 2005 గురించి తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, ఏపౌరుడైనా ప్రభుత్వశాఖల నుండి తమకు అవసరమైన సమాచారాన్ని పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తోందని తెలిపారు. అలాగే, పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దిష్ట కాలవ్యవధిలో అందించడం ప్రభుత్వ అధికారుల బాధ్యతగా ఈ చట్టం పేర్కొంటుందని వివరించారు. 2005 సంవత్సరంలో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్, ఏలూరు ఆదేశాల మేరకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కేవలం కోర్టుఫీ స్టాంపుతో పౌరులు తమకు కావాల్సిన సమాచారాన్ని అర్జీ రూపంలో సంబంధిత పౌర సమాచార అధికారికి సమర్పించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. పౌర సమాచార అధికారి వారి నుంచి సరైన స్పందన లభించని పక్షంలో, అప్పిలేటు అథారిటీని సంప్రదించే అవకాశం కూడా పౌరులకు ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లు, అప్పీలేట్ అధారిటీ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.ఎం. అంబేద్కర్,         టి.శశిధర్  మరియు విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author