టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడిగా ముల్లా.మోయిన్…
1 min read

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే యువ నాయకుడికి దక్కిన గౌరవం…
హోళగుంద, న్యూస్ నేడు: టీడీపీ హోళగుంద మండల మైనారిటీ అధ్యక్షుడిగా యువనాయకుడు ముల్లా.మోయిన్ నియమితులయ్యారు.టీడీపీ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడే యువ నాయకుడికి తగిన గౌరవం దక్కింది. టిడిపి యువ నాయకుడు ముల్ల మోయిన్ సిబిఎన్ ఆర్మీ లో చురుకుగా పనిచేస్తూ, 2014 నుండి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల, పార్టీ నాయకుల మన్ననలు పొందుతున్నారు.తెలుగుదేశం పార్టీలో యువనాయకుడిగా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. యువనాయకుడు ముల్లా మోయిన్ టిడిపి పార్టీ క్షేత్రస్థాయి బలోపేతానికి చేసిన కృషి,సేవలను గుర్తించి నేడు మండల మైనార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది.తన సేవలను గుర్తించి మండల మైనారిటీ అధ్యక్షునిగా నియమించిన ఆలూరు తెదేపా ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్,మండల టిడిపి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.


