పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు వేలం
1 min read

ప్రొహిబిషన్ &ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు వేలం నిర్వహించినట్లు నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు.కర్నూలు ఎక్సైజ్ డిప్యూటి కమీషన్ శ్రీదేవి మరియు నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్.రవికుమార్ ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి. రాముడు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఉ 11 గం.లకు వేలం పాట నిర్వహించారు.నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సారా మరియు మద్యం కేసుల్లో సీజ్ అయిన 9 వాహనాలను బహిరంగ వేలం వేయడం జరిగిందని వేలం పాటలో ఔత్సాహికులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయించిన ధర 90 వేలు కాగా వేలంలో 1,01,300 రూ.లు పాడగా దాని మీద అదనంగా జి.ఎస్టి 18,234 రూ లు వెరసి మొత్తం 1,19,534 రూ.లు రావడం జరిగిందని సీఐ రామాంజనేయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ జఫురుల్లా మరియు సిబ్బంది శంకర్ నాయక్, పద్మనాభం,మధుసూదన్ ప్రసాద్,శ్వేతారాణి,రమిజాబీ పాల్గొన్నారు.

