NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి సాగుతో పండించిన పంటలే ఆరోగ్యానికి శ్రేయస్కరం

1 min read

చాగలమర్రి , రూరల్ న్యూస్​ (నేడు) : ప్రకృతి సాగుతో పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని ప్రకృతి వ్యవసాయ మండల ఇన్‌చార్జి పి. నాగేశ్వరరెడ్డి,ఎంపీడీఓ కార్యాలయ సీనియర్‌ సహాయకులు బాలనరసింహులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన కూరగాయలు,ఆకుకూరల స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల పట్ల ప్రజలు చూపిన స్పందనపై నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాలు భూసారాన్ని కాపాడుతూ తక్కువ ఖర్చుతో సాగు చేయడానికి దోహదపడతాయని, పర్యావరణ సమతుల్యతను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సహజంగా పండిన ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా రసాయనాల ప్రభావం తగ్గి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రూపసి రాజ్ ,కమ్యూనికేషన్స్ ఎన్‌ఎఫ్‌ఐ అభిషేక్ రాజ్, జిఎస్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది పర్వీన్‌,హరిత,యూనిట్ ఇన్‌చార్జ్ నిరంజన్, ఐసీఆర్పీలు భాషా, లక్ష్మీ నరసమ్మ, రైతులు పాల్గొన్నారు.

About Author