NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు

1 min read

ప్రతి ఇoట సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్న

 రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి

శబ్ద కాలుష్యాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు

చట్టాన్ని అతిక్రమిస్తే కఠినమైన  మరి చర్యలు

 బహిరంగ ప్రదేశాలలో మద్యం పార్టీలు,ధూమపానం చేయరాదు

 జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు తెలియ చేసినారు.ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా వేడుకల నిర్వహణపై జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఎస్పీ పలు కీలక సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేశారు.ఎస్పీ ముఖ్య సూచనలు వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలి. అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చు కోవద్దు.శబ్ద కాలుష్యం సైలెన్సర్లు మార్చినా అట్టి వాహనాలను సీజ్ చేస్తాం.మద్యం సేవించి డ్రైవింగ్,నూతన సంవత్సర వేళ మద్యం సేవించి వాహనాలు నడపరాదు. బహిరంగ వేడుకలు.రోడ్లపై కేకులు కట్ చేస్తూ, ప్రజలకు మరియు రాకపోకలకు ఆటంకం కలిగించ కూడదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరం.జిల్లా ఎస్పీ  హెచ్చరిక.పండుగను ఆనందంగా జరుపుకోవాలి కానీ, ఎదుటి వారికి అసౌకర్యం కలిగించే హక్కు ఎవరికీ లేదు. అధిక శబ్దాలతో ప్రజలకు ఆటంకం కలిగించినా, వేగంగా వాహనాలు నడుపుతూ ఇతరులను భయభ్రాంతులకు గురి చేసినా చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తాం.ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి, సురక్షితమైన వాతావరణంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలి.మీ సంతోషం ఇతరులకు ఇబ్బంది కాకూడదు. బాధ్యతాయుతమైన పౌరులుగా పండుగను జరుపుకుందాం అని  ఎస్పీ  ఈ సందర్భంగా తెలియ చేసినారు.

About Author