ఉపాద్యాయులు బాధ్యతతో వ్యవహరించాలి!
1 min read
రామచంద్రయ్య
పత్తికొండ , న్యూస్ నేడు: ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతను గుర్తు తిరిగి తమ బాధ్యతలు నిర్వర్తించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య కోరారు. బుధవారం పత్తికొండ స్థానిక చదువుల రామయ్య భవనం ఆవరణంలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్.టి.యు) 2026 నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్ ను రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి .రామచంద్రయ్య చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించాలి అన్నారు. హక్కుల కోసం పోరాడుతూ, బాధ్యతలను మరువరాదు అని హితవు పలికారు.నైతిక విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేది టీచర్లు మాత్రమే అని అన్నారు. విద్యార్థులకు విలువలతో పాటు విజ్ఞానాన్ని అందించాలి కోరారు.విద్యార్థులను సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాల న్నా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.టి.యు. రాష్ట్ర కార్యదర్శి ఇంట్రెడ్డి రామ మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మండల అధ్యక్ష కార్యదర్శులు ఆవుల నాగరాజు ,మారుతి, ఆర్థిక కార్యదర్శి మండల వెంకటేశ్వర్లు ఎస్టియు సీనియర్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ కుంపటి నారాయణ, స్టీవ్ జిల్లా కౌన్సిలర్ బలరాముడు, చెన్నకేశవులు, ఇక్బాల్ హుస్సేన్ మొదలగువారు పాల్గొన్నారు.

