ఆదర్శప్రాయుడు బైరిపోగు లక్ష్మన్న
1 min read
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు
పత్తికొండ, న్యూస్ నేడు: నిరుపేద కుటుంబంలో పుట్టినా..ఎక్కడా కూడా అధైర్య పడకుండా రెక్కల కష్టంతో పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించి ప్రయోజకులను చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి బైరిపోగు లక్ష్మన్న అందరికీ ఆదర్శప్రాయులని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు అన్నారు. బుధవారం బైరిపోగు లక్ష్మన్న పెద్ద కర్మను పురస్కరించుకొని కనకదిన్నె గ్రామంలో ఆయన స్వగృహంలో సంతాపసభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.అనంతరం సువర్ణ రాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఈ.నాగరాజు గౌడ్,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పార రాఘవేంద్ర,సీపీఎం నాయకులు రమేష్,రాము,సుధాకర్, మాణిక్యంలు మాట్లాడుతూ..పూర్వం దళితులు అంటే అంటరాని తనం, అస్పృశ్యత ఉండేదన్నారు.దీనికి తోడు నిరక్షరాస్యత కూడా ఎక్కువగా ఉండేదన్నారు.ఒక పేదరికం..మరో పక్క సామాజిక కట్టుబాట్లు,నిరక్షరాస్యత ఉన్నా అన్నిటిని ఎదుర్కొని తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషిస్తూనే..మరో పక్క తనలాగా తన పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో పిల్లలందరినీ ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దడం నిజంగా అభినందనీయం అన్నారు.ఆయన నేడు మన మద్యలో లేక పోయినా ఆయన అనుసరించిన మార్గం,జీవితం ఆదర్శనీయం అన్నారు.కుమారులు, పిల్లలు కూడా ఆయన మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో కుమారులు బి.రంగస్వామి ముద్దురంగడు,ఏపీయూడబ్ల్యుజే పత్తికొండ నియోజకవర్గ అధ్యక్షులు బి.ఎం.సాల్ రంగడు,కోడలు అంజనమ్మ,సుగుణమ్మ, శాంతకుమారి,లక్ష్మి,కూతుర్లు రంగమ్మ, రంగమ్మ,చిన్న రంగమ్మ,అల్లుళ్ళు పాండు, ఆనందు,మనవళ్లు మనవరాలు సాగర్, అభిలాష్,మహీధర్. తదితరులు పాల్గొన్నారు.

