NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంతో బాలల ఆరోగ్య సంరక్షణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు జిల్లాలో జూన్,2025 నుండి అన్ని అంగన్వాడీ కేంద్రాలు,ప్రభుత్వ,ప్ర భుత్వ సహాయ పాఠశాలల్లో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కె) సమర్థవంతంగా అమలు అవుతోంది.ఈ కార్యక్రమం ప్రధానంగా పిల్లల ఆరోగ్య స మస్యలను తొలిదశలో గుర్తించడం,సమ యానికి తగిన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఉంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుపబడుతున్న ఈ కార్య క్రమం ద్వారా పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం,వారి సమగ్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో ప ట్టణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు,గ్రామీణప్రాం తాల్లో ఎంఎల్హెచ్పీ / సిహెచ్ఓలు యాప్ ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య సర్వే నిర్వ హిస్తున్నారు. ఈ సర్వేలో పిల్లల పోషకస్థి తి,జన్యు లోపాలు,చూపు,వినికిడి,దంత ఆరోగ్యం,ఇతర సాధారణ వ్యాధులను గు ర్తించడం జరుగుతుంది.సర్వేలో అనుమా నాస్పదంగా గుర్తించిన కేసులు 4డీ మెడిక ల్ ఆఫీసర్ యాప్‌లో నమోదు చేయబడ తాయి.తరువాత సంచార చికిత్స కార్యక్ర మం ఎస్ సిపిలో భాగంగా మెడికల్ ఆఫీ సర్ పిల్లలను ప్రత్యక్ష పరిశీలన ద్వారా ధృ వీకరణ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.ప్రస్తుతానికి అంగన్వాడీ కేంద్రాల్లో 98.10 శాతం,పాఠశాలల్లో 79.39శాతం పిల్లలకు ప్రాథమిక సర్వే పూర్తయింది.మొత్తం 66, 624 మంది పిల్లల్లో ఆరోగ్య సమస్యలు అనుమానాస్పదంగా గుర్తించబడ్డాయి.వీ రిలో 83.11శాతం కేసులకు ధృవీకరణ స్క్రీనింగ్ పూర్తయింది.ఇప్పటివరకు 578 మంది పిల్లలు అవసరమైన వైద్య సేవలు అందుకున్నారు.రెఫరల్ అవసరమైన పిల్ల లను ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించ డానికి జిల్లాలో రెండు ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి.అలాగే కర్నూ లు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్,ఆదోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఉన్న జి ల్లా సత్వర చికిత్స కేంద్రాల ద్వారా ప్రత్యే క వైద్య సేవలు అందిస్తున్నారు.

About Author