NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది

1 min read

ప్రకృతి వ్యవసాయ డిపియం బి.వెంకటేష్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ఏలూరు జిల్లా వ్యవసాయ కార్యాలయంలోని ఐడీపీ హాల్‌లో బుధవారం ప్రకృతి వ్యవసాయంతో వివిధ శాఖల సమన్వయంతో మండల స్థాయి కన్వర్జెన్స్ మీటింగు నిర్వహించబడింది. ఈసమావేశానికి అగ్రికల్చరు ఏడీఏ, ఏలూరు ఏవో, పెదపాడు ఏవో,సర్ఫ్ సిబ్బంది అలాగే ఏలూరు మండల ఏపిఎం  హాజరయ్యారు.సమావేశంలో ప్రకృతి వ్యవసాయం  డిపిఎం బి.వెంకటేష్  మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని,ప్రజల్లో దాని ప్రాముఖ్యతను విస్తృతంగా తెలియజేయాలని అన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా వారి ఆరోగ్యం మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరచవచ్చనని పేర్కొన్నారు. అలాగే రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయాలని సూచించారు. ఎన్ ఎం ఎన్  ఎఫ్ (ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్) కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఎంపిక చేసిన గ్రామాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ సంబంధిత శాఖలతో కలిసి పనిచేస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న రైతులకు గుర్తింపుగా డిపియం బి.వెంకటేష్  సన్మానాలు చేశారు.ఈ సందర్భంగా  రైతు రెడ్డయ్య కొత్తూరు గ్రామం  మాట్లాడుతూ రసాయన ఎరువులు మరియు పురుగుమందులతో పండించిన ఆహారం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, అందువల్ల సాధ్యమైనంత వరకు అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని కోరారు. కనీసం కొంత భూమిలో అయినా కూరగాయలు, ఆకుకూరలు పండించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు.

About Author