NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి ఉంటుంది.. ఎంపీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంటుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు… ఖ్యాతి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచ్చిత శిక్షణ పొంది డిఎస్సీ లో వ్యాయామ ఉపాధ్యాయులగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు..సిల్వర్ జూబ్లీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతనంగా ఉపాధ్యాయులగా ఉద్యోగాలు పొందిన వారిని ఎంపీ అభినందించారు…ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ సమాజంలో ఎవరికి దక్కని గౌరవ మర్యాదలు ఒక్క ఉపాధ్యాయులకే దక్కుతాయన్నారు.. ఉపాధ్యాయులు తమ వృత్తి ని నీతి నిజాయితీలతో నిర్వర్తించి విద్యార్థుల భవిష్యత్తు ను బంగారు బాటగా మలచాలని సూచించారు…ఈ కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ ఆది నారాయణ రెడ్ది, రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఖ్యాతి స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

About Author