శత వసంతాల సభను జయప్రదం చేయండి
1 min read

వెలుగోడు, న్యూస్ నేడు: భారతదేశ పేద ప్రజల పోరాటాల సింహ స్వప్నం శ్రమజీవులకు అండగా ఉన్న సీపీఐ శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లక్షలాది మందితో జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగ నాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్,కార్యవర్గ సభ్యులు ఏం.రమేష్ బాబు లు పిలుపునిచ్చారు. సోమవారం వెలుగోడు మండల కేంద్రంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జిపు జాత మండలానికి చేరుకున్నది. కార్యక్రమానికి మండల సిపిఐ నాయకులు హరున్ రసీదు అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ జనవరి 18వ తేదీన ఖమ్మం నగరంలో సిపిఐ శత వసంతాల వేడుకలను ఘనంగా జరగనున్నాయని స్వాతంత్రం సాధించిన తర్వాత ఎన్నో త్యాగాలతో నిర్బంధాలతో ఎన్నో పోరాటాలు ఎన్నెన్నో త్యాగాలు చేసింన సీపీఐ భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం సామజిక న్యాయం కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో అంతర్భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ 1932లోనే ప్రారంభమయ్యిందని తెలుగు నేలలో లక్షలాది ఎకరాల భూములను భూమిలేని పేదలకు పంచటంలోనూ, తెలంగాణ విముక్తి సాధనలోనూ సీపీఐ నిర్వహించిన పాత్ర అజరామరం అని కొనియాడారు. భాషాప్రయుక్త రాష్ట్రాలకు బీజం పడి నందికొట్కూరు నియోజకవర్గం ప్రాంతంలో అనేక పోరాటాలకు నాంది పలికి పేదలకు మౌలిక సదుపాయాలు కావాలని భూ పంపిణీ చేయాలని పోరాటాలు కొనసాగించిందన్నారు. ఈ లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ ముందుకు సాగుతున్నదని రైతులు సకల రంగాల శ్రమజీవుల కోసం జరుగు జనవరి 18న ఖమ్మం పట్టణంలో జరిగే శతాబ్ది ఉత్సవాల ముగింపు ప్రదర్శన, బహిరంగ సభలలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరారు. నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు సహకరిస్తూ , పేద ప్రజలకు ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదని , కార్మిక, శ్రామిక వర్గాలను పట్టించుకోవడం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ,భార్గవ్, జిల్లా నాయకులు సుబ్బారెడ్డి సోమన్న నాగరాజు ప్రజా నాట్య మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

