NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాఘవేంద్రుని సన్నిధి లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయుడు

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, ఏపి వాల్మీకి బోయ సంఘం అధ్యక్షులు వాల్మీకి క్రాంతి నాయుడు శనివారం వచ్చారు. వీరికి ఏపి వాల్మీకి బోయ సంఘం మంత్రాలయం నియోజకవర్గం అధ్యక్షులు, సూగురు సాగునీటి సంఘం ఛైర్మెన్ నరసింహులు ఘనంగా స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.   వీరికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వాదించారు.

About Author