వైభవంగా వసంత పంచమి అక్షరాభ్యాస కార్యక్రమం
1 min read

హోళగుంద న్యూస్ నేడు : వైభవంగా జరిగిన వసంత పంచమి అక్షరాభ్యాస కార్యక్రమం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. హొళగుంద నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం వైభవంగా జరిగింది అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు దాదాపుగా 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమం అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు పాఠశాల యాజమాన్యం తరఫున అక్షరాభ్యాస కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నారులకు ఉచితంగా పలక బలపం అందించారు అదేవిధంగా పూజా కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారు మాట్లాడుతూ ఈరోజు విద్యార్థులకు ఎంతో శుభదినం అని చెప్పారు అదేవిధంగా భారతదేశం స్వాతంత్ర సంపాదించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క సేవలను కొనియాడారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం అయినటువంటి కరస్పాండెంట్ బి మల్లికార్జున, హెడ్మాస్టర్ కే గోపీనాథ్ ,వైస్ ప్రెసిడెంట్ కె నాగప్ప, సెక్రెటరీ వి కొట్రేష్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.


