ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా ప్రభంధకారిణి సభ్యులు కృష్ణా రెడ్డి మరియు ప్రధానాచార్యులు కె. పార్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వాసు మాట్లాడుతూ శివాజీ జీవిత విషయాలు తెలియజేస్తూ ఆయన తల్లి దండ్రులు పేర్లు తల్లి జిజీయా బాయ్, తండ్రి భోన్సులే అని గురువులు సమర్థ రామదాసు, దాదాజీ కొండదేవ్ అని వీరు శివాజీ కి ఒకరు చదువు, మరొకరు యుద్ధ విద్యలు నేర్పారని, ఈయన హిందూ సామ్రాజ్యన్ని నిర్మించాడని, మొఘలు లు భారత దేశ ప్రజలను చిత్ర హింసలు పెడుతుంటే వారిని పారద్రోలాడు సమర్థ రామదాసు శివాజీ కి గంగా జలము, ఆవు పేడ, మట్టి ప్రసాదంగా ఇచ్చాడు. ఆయన అవి స్వీకరించి మన దేశాన్ని కాపాడడు, ఆయన రాయ్ ఘడ్ రాజ్యాన్ని పాలించాడని తెలియజేశారు.యుకెజి విద్యార్ధి ఆర్యన్ శివాజీ వేశాధారణ అందరినీ ఆకట్టుకుంది .ఈ కార్యక్రమం లో ఆచార్యులు, పిల్లలు పాల్గొన్నారు.


